కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలోని చింతకొమ్మదిన్నె మండలం బుగ్గ వంక ప్రాజెక్టు లోని బుగ్గ వంక కుడి కాలువ నుంచి - రెడ్డి చెరువుకు - మరియు ఎడమ కాలువ నుంచి - ఇప్పెంట నక్కల కుంట - చింతకొమ్మ దీన్నే చెరువులకు శుక్రవారం కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి నీటిని విడుదల చేసారు.ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు ఇన్ ఫ్లో 1600 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో - 500 క్యూ సెక్కుల నీటిని మెయిన్ గేట్ ద్వారా రైతుల కోసం,సాగునిరు కోసం ప్రజల త్రాగు నీటి కోసం బుగ్గవంక ప్రాజెక్ట్ నుండి చెరువులకు నీరు వదలడం జరిగిందన్నారు.