నారాయణ్‌ఖేడ్: తుర్కపల్లిలో ఈనెల తొమ్మిదిన ఆదివారం కార్తీకమాస దీపోత్సవం, గంగా హారతి:నారాయణఖేడ్ లో తాలూకా జంగమ సమాజ అధ్యక్షుడు శివకుమార్
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి సంగమేశ్వర ఆలయంలో ఈనెల 9న ఆదివారం కార్తీక మాస గంగా హారతి నిర్వహిస్తున్నట్లు తాలూకా జంగమ సమాజ్ అధ్యక్షుడు శివకుమార్ తెలిపారు. శనివారం జంగమ సమాజ్ సమావేశం నిర్వహించారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాదిన 14వ కార్తీక మాస వనభోజనం కార్య క్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. సాయంత్రం అమృతగుండంలో కార్తీక దీపోత్సవం, గంగా హారతి కార్యక్రమాలు కొనసాగుతాయని వీర శైవులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.