బాలా త్రిపుర సుందరి అలంకరణలో గండబోయినపల్లి శ్రీ సత్యమ్మ తల్లి
వాల్మీకిపురం మండలం గండబోయినపల్లి కోటలో వెలసిన శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు నేటి నుంచి అక్టోబర్ 2వరకు జరుగుతున్నాయి.ఇందులో భాగంగా మొదటి రోజు సోమవారం శ్రీ బాలా త్రిపుర సుందరిగా శ్రీ సత్యమ్మ తల్లి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ అధ్యక్షులు పులి సత్యనారాయణ రెడ్డి,కోశాధికారి ప్రభాకర్ రెడ్డి,కార్యదర్శి సద్దల చక్రపాణి,సభ్యులు శ్రీ రాము, పులి నారాయణరెడ్డి, ఎం శ్రీకాంత్ రెడ్డి ఉభయదారులుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు