సంతనూతలపాడు: సంతనూతలపాడు టిడిపి కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజయ్ కుమార్
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు టిడిపి కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే విజయ్ కుమార్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న 7 మందికి రూ. 7,75,012 విలువ చేసే చెక్కులను లబ్ధిదారులకు అందించినట్లు ఎమ్మెల్యే విజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రం ఆర్థిక కష్టాలలో ఉన్న పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు అడిగిన వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే విజయ్ కుమార్ అన్నారు.