ప్రభుత్వ చీప్ విప్ జీవీ, ఎంపీ లావు పై ఆరోపణలు చేస్తే బొల్లా మొహంపైనే పడుతుంది: వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన
కూటమి ప్రభుత్వం, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, తనపై మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేస్తున్న అర్థరహిత, అసంబద్ధ ఆరోపణలు ఇకనైనా మానుకోవాలని గురువారం రాత్రి 08 గంటల సమయం లో వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో జీడీసీసీబీ ఛైర్మన్ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు హెచ్చరించారు. వేలిముద్ర తప్ప ఏమీ తెలియన లారీ క్లీనర్ నుంచి అడ్డదారుల్లో ఎదిగిన బొల్లాకు వయసు పెరిగింది తప్ప బుద్ధి రావడం లేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో బొల్లా ఏం చేశాడు? తాను, జీవీ ఎమ్మెల్యేలుగా వినుకొండకు ఏం చేశామో ఎప్పుడైనా చర్చకు సిద్ధమన్నారు.