తలుపులను చంద్రబాబు పర్యటనపై జిల్లా ఎస్పీ సమీక్ష
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలంలోని పెద్దన్నవారిపల్లెలో నవంబర్ 1న పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గురువారం కదిరి పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కదిరి డిఎస్పి శివ నారాయణ స్వామి, సిఐలు పోలీస్ సిబ్బందితో సమీక్ష జరిపారు. బందోబస్తు చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.