గన్నవరం జెడ్పీ హైస్కూల్ బాలురహాస్టల్లో 7గురు విద్యార్థులు మద్యం తాగుతున్నారని ప్రశ్నించడంతో వంట మనిషిపై విద్యార్థుల దాడి
Machilipatnam South, Krishna | Sep 14, 2025
మద్యం తాగుతున్నారని ప్రశ్నించడంతో హాస్టల్లో వంట మనిషిపై విద్యార్థుల దాడి స్తానిక గన్నవరం మండలం గొల్లనపల్లిలో దారుణం చోటుచేసుకున్న ఘటన అలస్యంగా వెలుగులోకి వచింది. శనివారం రాత్రి గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ బాలుర హాస్టల్లో మద్యం మత్తులో ఏడుగురు విద్యార్థులు వంట మనిషి కాసిమ్మపై దాడి చేశారు. విద్యార్థులు హాస్టల్లో మద్యం తాగుతున్నారని ప్రశ్నించడంతో ఈఘటన జరిగింది. దాడిలో తీవ్రంగా గాయపడిన కాసిమ్మను కుటుంబ సభ్యులు గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హాస్టల్లో సుమారు 40 మంది విద్యార్థులు ఉన్నారు.