గన్నేరువరం: అసాంఘిక కార్యక్రమాలకు, పశువుల పాకలకు అడ్డాగా మారిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు...
పశువుల పాకలకు,అసాంగిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన డబుల్ బెడ్ రూం ఇళ్లు... కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో గత ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. పిల్లర్లు, స్లాబ్లులు శిథిలావస్థకు చేరుకున్నాయి. డబల్ బెడ్ రూమ్ నిర్మాణాలు పశువుల పాకలుగా మారాయి.అక్కడ చెట్లు ఎపుగా పెరగడంతో అసాంగిక కార్యక్రమాలకు అడ్డగా మారాయి.2018లో మాజీ MLA రసమయి బాలకిషన్ 188.70లక్షలతో ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు.ఇప్పటికైనా వీటిని పూర్తి చేసి పేదలకు పంపిణీ చేయాలని స్థానిక సీపీఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.