పుట్టపర్తిలోని కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో పాము హల్చల్
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలోని కలెక్టరేట్లో పాము హల్చల్ చేసింది. గురువారం ఉదయం కమాండ్ కంట్రోల్ రూమ్ లోకి ప్రవేశించి సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేసింది. కమాండ్ కంట్రోల్ రూమ్ లోకి ప్రవేశించిన పాము కంప్యూటర్ వెనుక ఉన్న ఫైళ్ళల్లో దాగివుంది. సిబ్బంది ఫైళ్ళను కదిలించగా పాము కనిపించడంతో భయాందోళన చెందారు. వెంటనే స్నేక్ క్యాచర్కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ కేచర్ చాకచక్యంగా పామును బంధించి అరణ్యంలో వదిలిపెట్టడం జరిగింది. దీంతో కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.