అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ లో నకిలీ పత్రాలు సృష్టించిన స్థలాన్ని కజేసేందుకు యత్నించిన ముగ్గురి అరెస్టు
ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్ క్రాస్ సొసైటీకి చెందిన స్థలాన్ని నకిలీ పత్రాలు సృష్టించి కాజేసేందుకు ప్రయత్నించిన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. పొన్నారి గంగన్న, వసీం కలిసి డాక్యుమెంట్ రైటర్ రాజు సహాయంతో ఫోర్జరీ పత్రాలు సృష్టించారని మంగళవారం తెలిపారు. నిందితుల నుంచి కంప్యూటర్, ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్ చేశామన్నారు.