నల్గొండ: వెట్టి చాకిరి నుంచి తెలంగాణ మట్టికి విముక్తి తెచ్చిన సెప్టెంబర్ 17 ప్రజా పాలన దినోత్సవం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్లగొండ జిల్లాలోని పర్యట గ్రౌండ్లో ఏర్పాటుచేసిన ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో రోడ్డు భవనాలు సినిమాట్రోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జెండాను బుధవారం ఎగరవేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ వ్యక్తి చాకిరి నుంచి తెలంగాణ మట్టికి విముక్తి తెచ్చిన సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. ఉద్యమకారులు కళాకారులు కార్మికులు కర్షకులు విద్యార్థిని విద్యార్థులు జిల్లా ప్రజానీకం యావత్ తెలంగాణ సమాజంలోఅన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు అన్ని విధాలుగా అందిస్తున్నామన్నారు.