సత్తుపల్లి: వర్షాలు కారణంగా కల్లూరు మండలం శాంతినగర్ లో నీరు చేరి కూలిపోయిన ఇల్లు
భారీ వర్షానికి కూలిన గోడ తప్పిన పెను ప్రమాదం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని వేడుకలు,కల్లూరు శాంతినగర్ తేల్లూరి భాస్కరరావు కు చెందిన పూరిల్లు కురిసిన అకాల వర్షానికి నీరు నిలిచి, గోడలు నాని కూలిపోయిన ఘటన జరిగింది. గోడ కూలిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది. భారీ వర్షాలకు శాంతినగర్ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక నీరు ఇళ్లల్లో చేరి ప్రజల అవస్థలు పడ్డారు.అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, గోడ కూలిన భాస్కరరావు కు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని అధికారులను వేడుకుంటున్నారు.