పత్తికొండ: పత్తికొండ డిపో పరిధిలో దేవనకొండ బస్టాండ్ లో కనీస సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు
పత్తికొండ డిపో పరిధిలోని దేవనకొండ బస్టాండ్లో కనీస సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డీవైఎఫ్ఎస్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, మండల నాయకుడు మహేంద్ర బుధవారం తెలిపారు. బస్టాండ్లో కూర్చోవడానికి సీట్లు లేకపోవడంతో పాటు, దుమ్ము, దుర్వాసనతో పరిస్థితి తీవ్రంగా ఉంది. బాత్రూములు పూర్తిగా పనికిరాక మూసివేయడంతో మహిళలకు సమస్యలు ఎదురవుతున్నాయి. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.