గద్వాల్: పాతపాలెం గ్రామంలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి
పాత పాలెం గ్రామంలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. పాతపాలెం గ్రామంలో బోయ ఆంజనేయులు, అనిత(23) దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆంజనేయులు వేరే పట్నానికి వలస వెళ్లగా.. ఆమె పిల్లలతో కలిసి ఊర్లోనే ఉంటోంది. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున అనిత నిద్ర లేవలేదని పిల్లలు గ్రామస్థులకు తెలియజేశారు. వారు వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతి చెంది ఉంది. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నా పోలీసులు..