పీలేరు పట్టణం కావలిపల్లిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి, కేసు నమోదు
పీలేరు పట్టణంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందగా కేసు నమోదు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆదివారం తెలిపిన వివరాలు మేరకు పీలేరు మండలం పీలేరు పట్టణం కావలిపల్లెలో దొరస్వామి అనే వ్యక్తి నాలుగేళ్లుగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి మద్యం సేవించి ఇంట్లో పడిపోగా శనివారం మధ్యాహ్నం వరకు స్పందన లేకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెల్లి పరిశీలించగా క్రింద పడి తీవ్రంగా గాయపడడంతో మృతి చెందినట్లు గుర్తించారు.అయితే ఇది హత్య లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు