కుప్పం: రామకుప్పంలో ఎమ్మార్పీఎస్ నేతల నిరసన
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ పై దాడి నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రామకుప్పంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల పరిషత్ కార్యాలయం ఎదుట బైఠాయించి గవాయ్ పై జరిగిన దాడిని నిరసిస్తూ నినాదాలు చేశారు. గవాయ్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మార్పీఎస్ నేతలు డిమాండ్ చేస్తూ తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.