మంత్రాలయం: ప్రజా సమస్యల పరిష్కారాలు వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలి: మంత్రాలయం ఎమ్మార్వో
మంత్రాలయం: మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో రమాదేవి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి ప్రజలు వారి వారి సమస్యలను వినతుల రూపంలో ఎమ్మార్వో రమాదేవికి సమర్పించారు. వచ్చిన అర్జీలను పరిశీలించి నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. సోమవారం జరిగిన ప్రజా గ్రీవెన్సు 5 వినతులు వచ్చినట్లు ఎమ్మార్వో తెలిపారు.