రాజానగరం: మెడికల్ కాలేజీ ల కోసం చేసిన అప్పు ఏం చేశారో జగన్ చెప్పాలి : రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన 5 వేల కోట్ల రూపాయల సొమ్ములు ఏం చేశారో ప్రజలకు తెలియజేయాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసులు డిమాండ్ చేశారు . సోమవారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చేసిన ఐదు వేల కోట్ల రూపాయల అప్పుతో సక్రమంగా ఖర్చుపెట్టినట్లు అయితే ఈపాటికి కాలేజీలు నిర్మాణాలు పూర్తి అయ్యేవని పేర్కొన్నారు.