నగరి: వికేఆర్ పురం సమీపంలో ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి
నగిరి నియోజకవర్గంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో వర్షం పడుతున్న సమయంలో అతివేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపు తప్పి రోడ్డు పై పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఈ ఘటన పుత్తూరు–తిరుత్తని రహదారి వికేఆర్పురం సమీపంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని 108 అంబులెన్స్ ద్వారా నగిరి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.