ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై మద్యం తాగి బొలెరో వాహనం నడిపిన డ్రై వరకు 30 రోజుల పాటు జైలు శిక్ష పదివేల రూపాయలు జరిమానా గిద్దలూరు కోర్టు విధించిందని ఎస్ఐ రవీంద్రారెడ్డి మంగళవారం తెలిపారు. అలానే డ్రైవర్ కు 6 నెలలపాటు కోర్టు లైసెన్సు రద్దు చేస్తూ తీర్పు ఇచ్చిందని ఎస్సై అన్నారు. మద్యం తాగి వాహనం నడిపితే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని ఎస్ఐ రవీంద్రారెడ్డి వాహనదారులను హెచ్చరిస్తున్నారు.