మెదక్: మిర్జాపల్లి శివారులో ఈ కంపెనీ మాకొద్దు అంటూ కంపెనీ ముందు గ్రామస్తుల ఆందోళన
Medak, Medak | Sep 22, 2025 చిన్న శంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫార్మా కంపెనీ మాకొద్దంటూ మాజీ ఉప సర్పంచ్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్థులంతా కలిసి కంపెనీ ముందు ఆందోళన కార్యక్రమం చేపట్టారు, ఈ కంపెనీ మాకొద్దని కంపెనీ నిర్మిస్తే మా వ్యవసాయ భూములు నాశనం అవుతాయని ఆందోళన చేపట్టారు, ఈ సందర్భంగా మాజీ ఉపసర్పంచ్ మనోజ్ కుమార్ తో పాటు గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో ఉన్న ఫార్మా కంపెనీ నుండి వెలువడే కాలుష్యంతో గ్రామంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఫార్మా కంపెనీ నిర్మాణం వెంటనే నిలిపివేయాలని ఆయన అధికారులు కోరారు.