తాడిపత్రి: తాడిపత్రి నియోజకవర్గం లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం : ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి
తాడిపత్రి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ఆస్మిత్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్దపప్పూరు మండలం చాగల్లు వద్ద మీడియాతో ప్రతి ఏరియాకు సమానంగా నీరు వెళ్లేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ప్రతి రైతుకు ఇవ్వాలన్న తపనతో కాలువలు శుభ్రం చేయించడంతో నీరు వచ్చి చాగల్లు, యాడికి, పెద్దవడుగూరు రైతులు ఆనందంగా ఉన్నారన్నారు.