యాగంటి క్షేత్రంలో వైభవంగా స్వామి అమ్మవార్లకు పల్లకి సేవ
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి పుణ్యక్షేత్రంలో శ్రీఉమామహేశ్వర స్వామివార్ల పల్లకి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకులు, ఈవో పాండురంగారెడ్డి, సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పల్లకిపై స్వామివార్లను ఊరేగించారు. భక్తులు పల్లకి మోశారు.