విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి ఉజ్వలమైన భవిష్యత్తుని చీకటిపాలు చేసుకోవద్దని ఈగల్ టీమ్ ఐజీ ఆకే రవికృష్ణ సూచించారు. గుంటూరు నగరంలోని నగరంపాలెంలోని భారతీయ విద్యాభవన్లో మాదక ద్రవ్యాల నియంత్రణ, దాని ప్రభావాలు అనే అంశంపై ఆదివారం అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆర్కే రవి కృష్ణ మాట్లాడుతూ భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలన్నారు. మాదకద్రవ్యాలు వాడటం వల్ల అనేక నష్టాలు జరుగుతాయని, దీనిపైన విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.