నాయుడుపేట పట్టణంలోని SBI లో సైబర్ నేరాలపై అవగాహన
తిరుపతి జిల్లా నాయుడుపేటలోని SBI బ్యాంకులో గురువారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అర్బన్ సీఐ బాబి ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఎస్సై భాను ప్రసన్న, స్టేట్ బ్యాంక్ మేనేజర్ నవీన్ పాల్గొని వినియోగదారులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత, ఆర్థిక సమాచారం పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆన్లైన్ మోసాలు, సైబర్ లింకుల పట్ల అపరిమితంగా ఉండాలని హెచ్చరించారు. డిజిటల్ వంటి బెదిరింపు కాల్స్ లకు ఎవరు భయపడద్దని ట్రైనింగ్ ఎస్సై భాను ప్రసన్న ప్రజలకు తెలియజేశారు.