విద్యార్థినులకు సమాజంలో జరిగే ఘటనలపై అవగాహన కల్పించిన డి.ఎస్.పి శివ నారాయణ స్వామి
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ వెంకటేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు సమాజంలో జరిగే అఘాయిత్యాలు ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కదిరి డిఎస్పి శివ నారాయణస్వామి, పట్టణ సీఐ నారాయణరెడ్డి లు పాల్గొని విద్యార్థినులకు అవగాహన కల్పించారు యువత సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులకు గాని, తల్లిదండ్రులకు గాని తెలియజేయాలని సూచించారు.