కొండపి: మర్రిపూడి మండలం రేగలగడ్డ గ్రామంలో భార్యను హత్య చేసి ఆపై ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన భర్త పరిస్థితి విషమం
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం రేగులగడ్డ గ్రామంలో భార్యను హత్య చేసి ఆపై ఆత్మహత్యకు యత్నించిన నరసింహ పరిస్థితి విషమంగా మారింది. శనివారం ఘటన చోటు చేసుకోగా నరసింహను మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న నరసింహ పరిస్థితి మరింత క్షీణించడంతో అధికారులు గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నరసింహ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని జరిగిన ఘటనపై లోతుగా ఉత్సాహంగా జరుపుతున్నట్లు ఆదివారం సీఐ సోమశేఖర్ తెలిపారు.