వరదయ్యపాలెం లోని ఓ దుకాణం వద్ద ఇసుకలో పూడ్చిన శిశువును కాపాడిన పారిశుద్ధ్య కార్మికులు
శిశువుకు వైద్యం.. శ్రీకాళహస్తికి తరలింపు వరదయ్య పాలెంలోని ఓ దుకాణం వద్ద ఇసుకలో పూడ్చిన శిశువును పారిశుద్ధ్య కార్మికులు గుర్తించి ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆడ శిశువుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.