తాడేపల్లిగూడెం: ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసాగా నిలుస్తోంది: ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరంగా మారిందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. సోమవారం సాయంకాలం 6 గంటలకు తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే కార్యాలయంలో పెంటపాడు మండలానికి చెందిన అరుగు సత్యవతి కి రూ.23,920, వీరాబత్తుల వెంకట మహాలక్ష్మి కి రూ.37,378, చిన్న తాడేపల్లి గ్రామానికి చెందిన నందమూరి సాయి లక్ష్మి కి రూ.1,62,000 ల సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసాగా నిలుస్తోందని అన్నారు.