జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరు అందుకుంది. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో నేతలు నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఒకరికొకరికి ఏమాత్రం తగ్గకుండా గల్లి గల్లి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ప్రచారంలో భాగంగా సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్లు ఐలయ్య కార్యకర్తలతో వెళుతుండగా అదే సమయంలో బిఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి నేతలతో ఎదురయ్యారు. ఐలయ్య కాంగ్రెస్ కరపత్రం చూపించగా మల్లారెడ్డి బిఆర్ఎస్ గెలుపు సింబల్ చూపిస్తూ సందడి చేశారు.