వైభవంగా జరిగిన గ్రామదేవత పండగ, చిత్ర విచిత్ర వేషధారణలతో ఆకట్టుకున్న కళాకారులు
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని మక్కువ మండల కేంద్రంలో గ్రామ దేవత పండగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం నుండి రాత్రి 10గంటల వరకు విచిత్ర వేషధారణలు, బిందెల డాన్స్ లతో కళాకారులు భక్తులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. పసుపు కుంకుమ లతో మొక్కులను చెల్లించుకున్నారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.