జగిత్యాల: బుధవారం 16న చర్మవ్యాధుల నిర్ధారణ శిబిరాన్ని విజయవంతం చేయండి :జిల్లా ఉప వైద్యాధికారి డా. ఎన్. శ్రీనివాస్
మోతే వాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారి సశక్తి పరివార అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం పది గంటల నుండి చర్మ వ్యాధుల నిర్ధారణకు వైద్య శిబిరం నిర్వహిస్తున్నారని జిల్లా ఉప వైద్యాధికారి డా. నీలారపు శ్రీనివాస్ మంగళవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలందరూ ఇట్టి సదవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ నీలారపు శ్రీనివాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో చర్మవ్యాధి నిపుణులు పాల్గొంటారని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు.