సూర్యాపేట: సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఫోటో రగడ
సూర్యాపేటలోని ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ మరోసారి వార్తల్లో నిలిచింది. బుధవారం తెలిసిన వివరాల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి చెందిన సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలను కార్యాలయంలో ఏర్పాటు చేయడంపై జగదీశ్వర్ రెడ్డి ,బిఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని పై వ్యానారెడ్డి స్పందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం చిత్రపటాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.