రాయదుర్గం: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత శిక్షణ కోర్సుకు ధరఖాస్తు చేసుకోండి : ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి
APSSDC ఆధ్వర్యంలో రాయదుర్గం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ సర్వేయర్ కోర్సులకు శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి తెలిపారు. 4 నెలలు జరిగే ఉచిత శిక్షణ కు నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. టెన్త్, ఇంటర్ డిప్లొమా, డిగ్రీ పూర్తయినవారు అర్హులు అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 30 లోపు స్కిల్ హబ్ సెంటర్ లో అప్లైచేసుకోవాలన్నారు.