శ్రీ సత్య సాయి జిల్లావ్యాప్తంగా పలు మండలాలలో రౌడీషీటర్లకు నేరస్తులకు కౌన్సిలింగ్
శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో ఆదివారం ఆయా మండలాల పరిధిలో పోలీసుల ఆధ్వర్యంలో పాత నేరస్తులకు, రౌడీషీటర్లకు, అమ్మాయిల వెంటపడి వేధించే నేరస్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల పట్ల అమ్మాయిల పట్ల నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నట్టు తెలియజేశారు. రౌడీ షీటర్లు తమ వైఖరి మార్చుకొని ప్రశాంత జీవితం గడపాలని, లేదంటే వారిపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని హెచ్చరించారు.