మనోహరాబాద్: అప్పుల బాధతో ఊరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
అప్పుల బాధతో ఊరి వేసుకొని యువకుడి ఆత్మహత్య తూప్రాన్ మండల పరిధిలోని రావెల్లికి చెందిన బొల్లెబోయిన అనిల్ అనే వ్యక్తి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న అనిల్ కు ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడంతో సోమవారం రాత్రి అప్పుల విషయంలో భార్యతో గొడవపడిన అనిల్ ఇంట్లోంచి బయటికి వెళ్లిపోయాడు, మంగళవారం ఉదయం శివారులోని వెంచర్ లో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.