నిర్మల్: రాష్ట్ర ఫైనాన్సు కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
Nirmal, Nirmal | Sep 16, 2025 తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు జిల్లాకు చేరుకున్న రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యను, ఆర్ &బి వసతి గృహంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ లు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రేపటి తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై వాకబు చేశారు.