కోడిని మింగిన కుండచిలువ- కొట్టి చంపిన గ్రామస్తులు
రైల్వే కోడూరు మండలంలోని రెడ్డివారి పల్లిలో భారీ కొండచిలువ కలకలం రేపింది. నరసింహులు అనే రైతు ఇంటి వెనకాల ఉన్న కోళ్ల షెడ్డులో ఒక కోడిని మింగేసింది. గమనించిన రైతు గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో అందరూ కలిసి రాళ్లు కర్రలతో కొట్టి చంపారు. అనంతరం పామును ఊరు బయట చెరువుల పారేశారు.