శంకరంపేట్ ఆర్: ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పిదాలకు తావివ్వద్దు, అర్హులకు లబ్ధి చేకూర్చాలి: మాందాపూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పిదా లకు తావివ్వొద్దని, అర్హులకు లబ్ది చేకూరేలా యా ప్లో వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.చిన్న శంకరం పేట మండల పరిధిలో మాందాపూర్ గ్రామంలో కొన్నసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే. యాప్ వివరాల నమోదు ప్రక్రియను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న 469 గ్రామపంచాయతీలలోనాలుగుమున్సిపాలిటీలలోగల75 వార్డులలోఇందిరమ్మఇండ్ల సర్వే అత్యంత పారదర్శకంగా కొనసాగుతుందని మొదటి విడతగా నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున మంజూరు చేయడం జరుగుతుందని,విడతల వారీగా ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని చెప్పారు