గాజువాక: మానవత్వం చాటుకున్న విశాఖపట్నం కి చెందిన దంపతులు,దొరికిన లక్ష రూపాయలు నగదు బాధితులకు అందజేసిన దంపతులు
రింతాడ గ్రామానికి చెందిన పిండి కృష్ణ,రవణమ్మ దంపతులు నర్సీపట్నం పనిమీద వచ్చి తిరుగు ప్రయాణంలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు వారి వద్ద ఉన్న లక్ష రూపాయల నగదును నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నందు జారవిడుచుకున్నారు మరికొద్ది సేపటి తర్వాత తమ డబ్బులు పోయాయని గమనించి ఆర్టీసీ కాంప్లెక్స్ నందు బాధపడుతుంటే విశాఖపట్నం కి చెందిన బోయదాపు జగదీష్,భారతి దంపతులు నర్సీపట్నం చట్టపు చూపుగా వచ్చి ఆ దంపతులు డబ్బులు తమకు దొరికాయంటూ తిరిగి అందజేశారు. దీంతో బాధితులు డబ్బులు తిరిగి ఇచ్చిన దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు