జగపతినగరంలో 'స్వస్థ నారి - సశక్త పరివార్ అభియాన్' కార్యక్రమం
కిర్లంపూడి పీహెచ్సీ ఆధ్వర్యంలో 'స్వస్థ నారి - సశక్త పరివార్ అభియాన్'లో భాగంగా జగపతినగరంలో ఆరోగ్య శిబిరం బుధవారం నిర్వహించారు.కొండయ్యపేట రామాలయంలో జరిగిన ఈ శిబిరంలో మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. "ముందస్తు జాగ్రత్తలతో విజయం సాధ్యం" అనే నినాదంతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రసూతి వైద్యురాలు గర్భిణులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు.