శ్రీహరికోటలో మరో భారీ ప్రయోగానికి ఇస్రో రెడీ
- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలో ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో భారీ ప్రయోగానికి సంసిద్ధమైనది. శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు 4,410KGs బరువైన CMS-03(GSAT-7R) ఉపగ్రహాన్ని బాహుబలి రాకెట్ LVM3-m5 ద్వారా నింగిలోకి పంపనుంది. శ్రీహరికోటలోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 5.26 గంటలకు కౌంటౌన్ ప్రారంభించారు. భారత నేవీ అవసరాల కోసం ఈ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇస్రో అభివృద్ధి చేసింది. అటు ప్రయోగం నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ నారాయణన్ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.