ఒంగోలు పట్టణంలోని త్రవ్వకుంట మూలమరుపు వద్ద నిలిచిపోయిన మురుగునీరు, వెంటనే సమస్య పరిష్కరించాలి: ప్రజలు, వాహనదారులు
Ongole Urban, Prakasam | Oct 20, 2025
ఒంగోలు నగర పరిధిలోని త్రోవగుంటలోని మూలములుపు వద్ద నెలల తరబడి మురుగునీరు కదలడం లేదు. ఆ ప్రాంతంలో దుర్వాసన వెదజల్లుతుండడంతో స్థానికులు, ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. మురుగునీటి కాలువల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీటితో పాటు మురుగునీరు కలగలిసిపోయి నెలలు తరబడి నిల్వ ఉంటుంది. అంతేగాక భారీ వాహనాలు వచ్చినప్పుడు ఆ మురుగు ప్రయాణికుల మీద పడుతోందన్నారు.