ఓటర్ల దినోత్సవంలో భాగంగా చౌటకూర్ మండల కేంద్రంలో విద్యార్థుల ప్రతిజ్ఞ
సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 12:30 నిమిషాల సమయంలో ఓటరు దినోత్సవం లో భాగంగా తహసిల్దార్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఓటు హక్కు పై విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. 18 సంవత్సరాలు నిండిన యువత తమ ఓటు ను నమోదు చేసుకొని ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విద్యార్థులతో తహసిల్దార్ ప్రతిజ్ఞ చేయించారు.