తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం సందర్భంగా బుధవారం పుష్పాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు ముందుగా అమ్మవారి ఆస్థాన మండపంలో దాతలు సమర్పించిన సుమారు 12 రకాల పుష్పాలను గంపల్లో ఉంచి పూజలు చేశారు అనంతరం ఆలయ డిప్యూటీఈవో హరింద్రనాథ్ ఉద్యానవన డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పూలబుట్టలను మాడవీధుల్లో ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు అమ్మవారి పుష్పయాగంలో వీటిని వినియోగించనున్నారు.