పూతలపట్టు: కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో 21 కేజీల మహా ప్రసాదం లడ్డు దక్కించుకున్న హైదరాబాద్ వాస్తవ్యులు
కాణిపాకం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు చివరి రోజు తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ స్వామివారి మహా ప్రసాదం – 21 కేజీల లడ్డును వేలం వేయడం జరిగింది. వేలంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, వికలాంగుల కల్యాణ వేదిక అధ్యక్షులు సుభాష్ గుప్తా హైదరాబాద్ వాసులు 21 కేజీల మహా ప్రసాద లడ్డూను ₹6,25,000/- కు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ఆలయ ఈవో పెంచల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.