సిర్పూర్ టి: బెజ్జూరు మండలంలో సమయపాలన పాటించని అధికారులు, కాళీ కుర్చీలతో దర్శనమిస్తున్న ఎంపీడీవో కార్యాలయం
బెజ్జూరు మండలంలోని అధికారులు సమయపాలన పాటించకపోవడంతో ఎంపీడీవో కార్యాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలు దాటిన ఎంపీడీవో, ఎంపీ ఓ కుర్చీలు ఖాళీగా ఉండడంతో వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు నిరాశతో వెన్ను తిరుగుతున్నారు. సోమిని గ్రామంలో వీధిలైట్లు లేకపోవడంతో ఫిర్యాదు చేయడానికి వచ్చిన టిఏజిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజు కార్యాలయానికి వెళ్ళగా అధికారులు ఎవరూ లేకపోవడంతో వినతిగారు. అధికారులు సమయపాలన పాటించకపోవడంతో వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు,