వర్షాలతో చెరువుగా మారిన రేణిగుంట కుర్ర కాలువ పద్మా నగర్
వర్షాలతో చెరువుగా మారిన కుర్రకాలువ పద్మానగర్ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు రేణిగుంట మండలం కుర్రకాలువ పద్మానగర్ ప్రాంత ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కాలువలు ఉప్పొంగి వీధులన్నీ నీటమునిగిపోయాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు గృహాల్లోనే చిక్కుకుపోయారు. చినుకు పడితే చాలు మా ఊరు చెరువే అవుతోంది. ఇళ్లలో నీళ్లు చేరి వండుకోలేకపోతున్నాం, తినడానికి కూడా ఇబ్బందే అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతుం