తాడిపత్రి: రాష్ట్రస్థాయి స్పీడ్ స్కేటింగ్ పోటీలకు ఎంపికైన తాడిపత్రి పట్టణానికి చెందిన విద్యార్థులు, క్రీడాకారులను అభినందించిన ప్రజల
రాష్ట్రస్థాయి స్పీడ్ స్కేటింగ్ పోటీలకు తాడిపత్రి క్రీడాకారులు ఎంపికయ్యారు. అనంతపురంలో జరిగిన జిల్లాస్థాయి SGFI స్పీడ్ స్కేటింగ్ పోటీలలో దాదాపు ఏడుగురు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. రాష్ట్రస్థాయి స్పీడ్ స్కేటింగ్ పోటీలు కాకినాడలో జరగనున్నట్లు కోచ్ సాంబశివ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులను తాడిపత్రి పట్టణ ప్రజలు అభినందించారు.