యాడికి మండల కేంద్రంతోపాటు మండల వ్యాప్తంగా శనివారం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఎమ్మార్పీఎస్, ఆయా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలను సాధిస్తామంటూ నినాదాలు చేశారు.